ADB: జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులుగా తిరుపతి రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. శాఖాపరమైన కార్యకలాపాలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
జిల్లా గనులు, భూగర్భ శాఖ ఏడీగా తిరుపతి రావు


