ASF: రెబ్బెన మండలంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకంలో భాగంగా పత్తి సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేప నూనె రసాయనాలను AEO వినోద్ రైతు వేదికలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి పంటలో చీడపీడల నివారణతో పాటు పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ ఇన్పుట్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రైతులకు వేప నూనె రసాయనాల పంపిణీ


