SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం 3వ వార్డులో బుధవారం 21 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోదాడలో 21 మందికి కొత్త పెన్షన్లు పంపిని


