హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య

ఉమ్మడి జిల్లాలో అప్పుల బాధతో టైలర్ శంకర్(34) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ జగిత్యాల తీన్ ఖని చౌరస్తా వద్ద 20 ఏళ్లుగా టైలరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. పండుగలకు వ్యాపారం బాగుంటుందని ఆశించినా రెడీమేడ్ ప్రభావంతో ఆదాయం రాలేదు. అద్దె, కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరగడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.