VKB: తాండూరు కంది ప్రత్యేకతను కాపాడేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు DEO కవిత పేర్కొన్నారు. యాలాలలోని తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన రైతులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో HYDకు చెందిన త్రియాంబుటెక్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అదనపు సంచాలకురాలు అరుణ, యాలాల AO శ్వేతారాణి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తాండూరు కంది ప్రత్యేకతను కాపాడేందుకు క్యూఆర్ కోడ్ విధానం


