SDPT: సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ సర్పంచ్ అనుముల వెంకటి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావును కలిసి పార్టీలో చేరికను ప్రకటించారు. దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరినట్లయింది.
తెలంగాణ
సొంత గూటికి చేరిన పొన్నాల సర్పంచ్ వెంకటి


