హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మధ్యలోనే నిలిచిన బ్యాటరీ బస్సు

MLG: మంగపేట నుంచి హనుమకొండకు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ (బ్యాటరీ) బస్సు బుధవారం ఉదయం చిన్నబోయినపల్లి వద్ద అకస్మాత్తుగా ఎనిమిది గంటల ప్రాంతంలో నిలిచిపోయింది. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో గంటకు పైగా రోడ్డుపైనే ఆగిపోయింది. పరీక్షలకు, అత్యవసర వైద్య సేవల నిమిత్తం, ఉద్యోగాల కోసం హనుమకొండకు ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.