హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసర్వే పనులు పరిశీలించిన సబ్ కలెక్టర్

KMM: వేంసూరు మండలం అమ్మపాలెంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి భూ సరిహద్దులు, విస్తీర్ణాలు, రికార్డుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలో 1,389.20 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు 1,100 ఎకరాల రీసర్వే పూర్తయినట్లు అధికారులు వివరించారు. రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు.