హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లు మాఫియా కొత్త పుంతలు..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు మాఫియా కొత్త పుంతలు తొక్కుతున్నట్లు అధికారులు గుర్తించారు. కల్లును తయారు చేసే మత్తు పదార్థాలు సొంతంగా తయారు చేస్తున్నారని ఇటీవలే ఈగల్ ఫోర్స్ గుర్తించింది. కల్తీ కల్లు మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. పంట పొలాల్లో కృత్రిమంగా తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.