హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరిన బ్రాహ్మణపల్లి యువత

KMR: తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 10 మంది యువకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువతకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి నచ్చి పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు.