హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ బీమా కల్పించాలి: ఎంపీడీవో

SRPT: అనంతగిరి మండలంలో ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో షేక్ సుష్మా ఈరోజు ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరై దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వహణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. అర్హులందరికీ పథకం అందేలా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.