హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు

SRPT: జిల్లాలో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని విస్తరించనున్నారు. జిల్లా పరిషత్‌తో పాటు 23 మండల పరిషత్ కార్యాలయాల్లో 'మీ ప్రమాణం' యాప్ ద్వారా సుమారు 300 మంది ఉద్యోగుల హాజరును నమోదు చేయనున్నారు. ఇప్పటికే జడ్పీ కార్యాలయంలో అమలవుతుండగా, వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లోనూ ప్రారంభించనున్నారు.