హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో శివమాల ధారణ

MDK: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో శివమాల ధరించిన భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.