హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టీల్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడ్డ డీసీఎం

MLG: ములుగు–వరంగల్ జాతీయ రహదారిపై మల్లంపల్లి ఎస్సారెస్పీ కెనల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. జామాయిల్ మొక్కల లోడుతో హనుమకొండకు వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి కొత్తగా ఏర్పాటు చేసిన స్టీల్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.