హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌లో తగ్గిన నీటిమట్టం

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. బుధవారం ఉదయం 6 గంటలకు 1,075.40 అడుగుల నీటిమట్టం, 33.677 టీఎంసీల నిల్వ నమోదైంది. ఇన్‌ఫ్లో లేకపోవడంతో వివిధ అవసరాలకు 1,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువకు 150, అలీసాగర్‌కు 360, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలయ్యాయి.