హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అందాల మధ్య బుగులోని వెంకన్న జాతర

BHPL: తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టపై వెలసిన బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రకృతి అందాల మధ్య కొండపై జరిగే ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. జాతరలో ప్రభబండ్ల ఊరేగింపు ఆకర్షణగా నిలుస్తుంది.