నాగర్కర్నూల్ జిల్లాలోని పలు గ్రామాలు, తండాల్లో నాటుసారా విక్రయాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగాల మండలం యాపట్ల తండా నుంచి అంబట్పల్లికి గుడుంబా తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. దీంతో యువత, కూలీలు మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ విక్రయాలను అరికట్టాలని కోరారు.
తెలంగాణ
గ్రామాల్లో యథేచ్ఛగా నాటుసారా విక్రయాలు


