హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ వైర్లతో ట్రాక్టర్ దగ్ధం

NRPT: ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఉపసర్పంచ్ సంజీవ్‌కు చెందిన ట్రాక్టర్ గడ్డి లోడుతో వెళ్తుండగా ఉర్దూ మీడియం పాఠశాల వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు జేసీబీతో గడ్డి తొలగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫైర్ సిబ్బంది చేరుకునేలోపే ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది.