హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ తప్పిదం.. నేటితో 24 ఏళ్లు

MLG: ఏటూరునాగారం (M) చింతగూడెం-సింగారం మధ్య అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ 2002 నవంబర్ 18న RTCబస్సు పేల్చివేశారు. ఈ ఘటన జరిగి నేటితో 24 ఏళ్లు అవుతుంది. బస్సులో పోలీసులు ఉన్నారనే తప్పుడు సమాచారంతో మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో 14 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది.