హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకుల వద్ద దళారుల దందా..!

ADB: బోథ్ నియోజకవర్గంలోని బ్యాంకుల వద్ద దళారుల దోచుకుంటున్నారు. వ్యవసాయ, గృహ రుణాల కోసం వచ్చే గిరిజనులు, మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారు. పత్రాల పూరణకు రూ.100-200, రూ.10 లక్షల రుణానికి రూ.30 వేల వరకు దండుకుంటున్నారు. మరికొందరు సంతకాలు తీసుకుని నగదు కాజేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.