MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయంలో బుధవారం కార్తీక శుక్లపక్షం నవమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సౌమ్యవాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేశారు. పలు ద్రవ్యాలు పట్టు వస్త్రాలు సుగంధ పరిమళాల పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
ఏడుపాయలలో సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు


