హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హంద్రీ-నీవా నీటి మళ్లింపుతో అమ్మచెరువుకు కొత్తకళ

అన్నమయ్య: మదనపల్లె పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలను అధిగమించడానికి కార్యాచరణ మొదలైంది.  భూగర్భ జలాలు పెంపుపై కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని పట్టణ సమీపంలోని అమ్మచెరువుకు మళ్లించి పూర్తిగా నింపేందుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. తటాకాల్లో నీరు చేరడంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావులు రీఛార్జ్‌ అవుతున్నాయి.