హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కవ్వాల్‌లో కోతుల బీభత్సం

MNCL: జన్నారం మండలం కవ్వాల్ ముత్యాల పోచమ్మ ఆలయ సమీపంలో కోతులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కోతులు ఇళ్లపై సంచరిస్తూ, ఇళ్లపై ఉన్న నీళ్ల ట్యాంకుల మూతలను విరగ్గొడుతున్నాయి. వృద్ధులు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి తినే వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కలిగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.