హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్, వార్డు అభ్యర్థులకు MPDO సూచనలు

ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎంపీడీవో మనోజ్ పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇంటి పన్ను లేదా ఇతర పంచాయతీ పన్నుల బకాయిలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. నోడ్యూస్ సర్టిఫికెట్ జత చేయకపోయినా పర్వాలేదని, పోలీస్ స్టేషన్ నుంచి కేసులు లేవని సర్టిఫికెట్ తేనవసరం లేదని వెల్లడించారు.