హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి వేదికపై జిల్లా కలెక్టర్

NRML: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి జాతీయ స్థాయి 'లీడర్షిప్ యాస్ మిషన్' వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శకత, జవాబుదారీతనం, వినూత్న పరిపాలనా విధానాలపై జరిగిన చర్చల్లో పాల్గొని తెలంగాణ తరఫున జిల్లా పరిపాలనా అనుభవాలను పంచుకున్నారు.