MLG: వెంకటాపురం, ఎదిర 108 అంబులెన్సులను జిల్లా అత్యవసర సేవల విభాగం మేనేజర్ పి. రాజ్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. అంబులెన్సుల పనితీరు, సిబ్బంది అప్రమత్తత, రెస్పాన్స్ టైమ్, మందులు, ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ
108 అంబులెన్సుల పనితీరుపై తనిఖీ


