హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ పదవులకు 950 నామినేషన్లు

ప్రకాశం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో 139 సర్పంచ్ స్థానాలకు మూడు రోజుల్లో 950 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,396 వార్డు స్థానాలకు 3,474 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పెంచారు. బుధవారం పరిశీలన జరగనుంది. పోలింగ్ నవంబర్ 26, 29, డిసెంబర్ 2న మూడు విడతల్లో జరుగుతుంది.