ప్రకాశం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తుపాను బుధవారం తీవ్ర తుపానుగా, గురువారం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం నెల్లూరు-విశాఖ మధ్య తీరం దాటే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 130-145 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
తీరం దాటనున్న అక్వాన్ తుపాను


