హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందలూరు సర్పంచిగా గంటా కుమారి

KDP: నందలూరు సర్పంచిగా గంటా కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం గడువు ముగిసే సమయానికి ఆమెకు పోటీగా ఇతరులెవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో కుమారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. 2006 పంచాయతీ ఎన్నికల్లోనూ కుమారి అత్త గంటా నాగలక్ష్ముమ్మ ఏకగ్రీవంగా గెలుపొందింది. తిరిగి 15 సంవత్సరాల తర్వాత అదే గ్రామం, అదే పదవికి ఆ ఇంటి కోడలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.