హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగేళ్లుగా వినియోగంలో లేని ఆర్వో కేంద్రం

KDP: ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 93 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ మనబడి నాడు-నేడు రెండో దశలో ఆర్వో కేంద్రాన్ని అమర్చినా నాలుగేళ్లుగా వినియోగం లేదు. సాంకేతిక సమస్యపై హెచ్‌ఎం పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ఉపాధ్యాయులే చందాలు వేసుకుని ప్రైవేటుగా నీటిని కొనుగోలు చేసి తెప్పిస్తున్నారు.