హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?.. సీపీ మహేష్ భగవత్ ఫైర్!

HYDలో స్వచ్ఛమైన వెండి రేకుల పేరుతో అల్యూమినియం రేకులను స్వీట్లలో వినియోగిస్తున్న ముఠాపై సీపీ మహేష్ భగవత్ తీవ్రంగా స్పందించారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో 4 తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశామని నకిలీ రేకులు, అల్యూమినియం ఫ్లేక్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.