హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పని చేయని ఆర్వో కేంద్రాలు.. విద్యార్థులకు కష్టాలు

అన్నమయ్య: రాజంపేట మండలంలో నాడు-నేడు నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రాలు ఎక్కడా వినియోగంలో లేవు. జడ్పీ ఉన్నత పాఠశాలలు 11, ప్రాథమిక బడుల్లో 20 చోట్ల యంత్ర పరికరాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక లోపాలతో నిలిచిపోయాయి. నిర్వహణ గడువు ముగియడంతో కాంట్రాక్టర్ బాగు చేయడం లేదు. చేసేదేమిలేక పక్కన పెట్టేశారు. విద్యార్థులకు హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, దాతల సహకారంతో నీరందిస్తున్నారు.