హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మక్క సాగర్ డీపీఆర్ వెనక్కి

MLG: తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు రూ.9,257 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. నీటి నిల్వకు ఛత్తీస్‌గఢ్ అంగీకరించినా, ఆయకట్టు, నీటి పంపిణీ వివరాలు లేవంటూ కేంద్ర జల సంఘం డీపీఆర్‌ను తిప్పి పంపింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ సవరించిన డీపీఆర్ సిద్ధం చేయడంలో నిమగ్నం అయింది. ముంపు పరిహారంపై రెండు రాష్ట్రాల మధ్య స్పష్టత రాకపోవడంతో ఎన్ఓసీ ఆలస్యమవుతోంది.