హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్స్యగిరి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

NLG: వలిగొండ మండలం వెంకటాపురంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 24 వరకు జరుగుతాయి. 20న గరుడ ధ్వజారోహణ, 21న హనుమంత వాహన సేవ, 22న ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం, 24న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం ఉంటాయి. ఆలయ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు.