హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

SRCL: వేములవాడ అర్బన్ మండలం అనుపురం ఉన్నత పాఠశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై గాదె రమ్య, కానిస్టేబుళ్లు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, 'సే ఎస్ టు లైఫ్ - నో టు డ్రగ్స్' కార్యక్రమం నిర్వహించారు.