NLG: త్రిపురారం మండలం కొంపసాగర్ పంచాయతీ కోమటిగూడెంలో 40 ఏళ్లుగా శ్మశానంగా వాడుతున్న సర్వే నంబర్ 275లోని ఎకరం ప్రభుత్వ భూమిని దుగ్గెపల్లికి చెందిన వ్యక్తి ఆక్రమిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. 10 గుంటల రాళ్ల భూమి మాత్రమే వదిలి, మిగతా 30 గుంటలకు హద్దురాళ్లు పాతాడన్నారు. సర్వే చేసి హద్దులు తేల్చాలని తహసీల్దార్ ప్రమీలకు వినతిపత్రం ఇవ్వగా, చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
తెలంగాణ
శ్మశాన భూమి కబ్జాపై ఫిర్యాదు


