హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి నేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు (బుధవారం) వేంసూరులో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు జడ్పీ హైస్కూల్ ఆవరణంలో చేయూత పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.