హైదరాబాద్: 28°C
తెలంగాణ

HMDA భూముల వేలం.. తేదీల వివరాలు ఇవే!

HYD: HMDA ఆధ్వర్యంలో హుడా హైట్స్, నియోపోలిస్, మూసాపేటలోని భూముల ఈ-వేలానికి సంబంధించి టీ-హబ్‌లో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిడ్డర్లకు భూముల వివరాలు, అభివృద్ధి నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. హుడా హైట్స్‌లో 8 ప్లాట్లకు ఈనెల 25న, మూసాపేటలో 3.15 ఎకరాలకు ఈనెల 27న ఈ-వేలం నిర్వహించనున్నారు.