హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 12 చోట్లే కొనుగోళ్లు..!

PDPL: జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను సుమారు 300 తెరిచినా, ఇప్పటివరకు కేవలం 12 కేంద్రాల్లోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. జిల్లాలో దాదాపు 350 టన్నుల వరకు సేకరించారు. 200కు పైగా రైస్ మిల్లులుండగా కేవలం 11 మిల్లులనే కేటాయించారు. సుమారు 70 శాతం ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు నేరుగా కొంటున్నారు. మంథని నుంచి రోజూ 10-12 లారీలు కర్ణాటక, ఏపీకి వెళ్తున్నాయి.