హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీర్లపాలెంలో రూ.750 కోట్ల ఇథనాల్ ప్లాంట్

NLG: దామరచర్ల మండలం వీర్లపాలెంలో సోహం అగ్రో ఇండస్ట్రీస్ రూ.750 కోట్లతో 108.82 ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 20న కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. కృష్ణా నదికి 3.5 కి.మీ. దూరంలోనే ప్లాంట్ ఉండటం, అడవి, ఎత్తిపోతల పథకం, నీటి వినియోగాన్ని ఈఐఏ నివేదిక విస్మరించిందని స్థానికులు ఆరోపిస్తూ, విచారణ వాయిదా వేయాలని కలెక్టర్‌ను కోరారు.