NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను పాండురంగాపురం, మిట్నాల గ్రామాల రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సాగు చేసుకున్న పంటలకు వెంటనే సాగునీరు అందించాలని వారు మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి కేసీ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఫరూక్‌ను కలిసిన రైతులు


