హైదరాబాద్: 28°C
తెలంగాణ

డాక్టర్‌కు బెయిల్ వద్దన్న పోలీసులు

HYD: అక్రమ అండాల సేకరణ కేసులో ఆరో నిందితురాలైన పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మొదటి నిందితుడు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకుడు అమిరిశెట్టి దుర్గాప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఆమెను చేర్చామని, ఇప్పటికే ఎనిమిది ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.