హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 ఏళ్ల బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు

ATP: అనంతపురం సర్వజనాసుపత్రి వైద్యులు 15 ఏళ్ల బాలిక కడుపులో పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకలను శస్త్రచికిత్స చేసి తొలగించారు. రాయదుర్గానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షల్లో ట్రికోఫగియా, రాంపుంజెల్ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తించారు. 1.2 మీటర్ల పొడవున్న వెంట్రుకల ముద్దను తొలగించగా, బాలిక ఆరోగ్యంగా ఉంది.