హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడారిగా మారిన పల్లె పకృతి వనం..!

SRD: నాగలిగిద్ద మండలం గంగారాంతండాలో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. ఒకప్పుడు పచ్చని చెట్లు, మధ్యలో నడకదారితో ఆహ్లాదాన్ని పంచిన ఈ వనం నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పచ్చదనం కనుమరుగైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.