HYDలోని గోషామహల్ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి వారాలుగా తీవ్ర నీటి కొరత నెలకొందని స్థానికులు వాపోతున్నారు. జనావాసాల మధ్య వాణిజ్య ట్యాంకర్లు రేయింబవళ్లు నీటిని తోడేస్తున్నాయని, మాలకుంట, పటేల్ నగర్‌లో బోర్లు ఎండిపోయాయని ఆరోపించారు. వాల్టా చట్టం అమలు బలహీనంగా ఉందని, అధికారులు తనిఖీలు పెంచి గృహావసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని TG ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు కోరారు.
తెలంగాణ
గోషామహల్‌లో ఎండుతున్న బోర్లు


