WGL: వర్ధన్నపేట శివారు డీసీ తండా వద్ద మాటేడు గ్రామానికి చెందిన బ్రహ్మచారి(38) మూర్ఛ రావడంతో మృతి చెందాడు. మంగళవారం బైక్‌పై వెళ్తుండగా తొలిసారి మూర్ఛ రావడంతో బస్సును ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు ప్రథమ చికిత్స చేయడంతో కోలుకున్నాడు.సెల్‌ఫోన్ కోసం తిరిగి అదే ప్రాంతానికి రాగా మరోసారి మూర్ఛ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
VIDEO: మూర్ఛతో ద్విచక్ర వాహనదారుడి మృతి


