SRPT: జిొల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును నకిలీ బంగారంతో రూ.21 లక్షల మేర మోసగించిన ఉదంతం బయటపడింది. అప్రైజర్‌గా పనిచేసిన ఉపేందర్ ఏడు నెలల క్రితం భార్య శైలజ, స్నేహితుడు సతీష్‌లతో నకిలీ నగలు తాకట్టు పెట్టించి, అసలువేనని నివేదిక ఇచ్చి రుణం ఇప్పించాడు. కొత్త మేనేజర్ వేరే అప్రైజర్‌తో తనిఖీ చేయించడంతో మోసం వెలుగుచూసింది. ఫిర్యాదు అందగా ఉపేందర్ పరారీలో ఉన్నాడు.
తెలంగాణ
నకిలీ నగలతో భారీ మోసం


