హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, జడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

KDP: నవంబర్ 19న ఎంపీపీ, 20న జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల  ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రకటించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు పూర్తిస్థాయి వీడియోగ్రఫీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.