MLG: గోవిందరావుపేట మండలం రాంనగర్ తండాకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి (55) విద్యుదాఘాతంతో మృతి చెందారు. మంగళవారం సాయంత్రం కుమారుడితో కలిసి ట్రాక్టర్‌పై పొలం నుంచి వస్తుండగా, రోడ్డుపై ఉన్న నీటి పైపును సరిచేస్తున్న సమయంలో విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో రైతు మృతి


