హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నమ్మకాన్ని నిలపెట్టుకోవాలి: మంత్రి

VZM: ప్రజలు కూటమి ప్రబుత్వం పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. మంగళవారం భోగాపురంలో ఆమె అధ్యక్షతన నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి నాయకులు, నూతన ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.